మేనమామ ఇంటికి వచ్చిన బాలురు.. “చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలు!” గంటల తరబడి సాగిన కిరాతకం.. నెట్టింట ఆగ్రహజ్వాలలు రేకెత్తించిన దారుణం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో, రక్షాబంధన్ పండుగ జరుపుకోవడానికి మేనమామ ఇంటికి వచ్చిన దళిత వర్గానికి చెందిన బాలురపై దొంగతనం నెపం మోపి దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆదిత్య చౌదరి అనే వ్యక్తి ఆ బాలురను పట్టుకుని, ఒక రేకుల షెడ్డులో బంధించి వారి చేతులు, కాళ్లు కట్టేసి గంటల తరబడి విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనను ఖండిస్తూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో.. బీజేపీ పాలనలో దళితులపై భయానక వాతావరణం సృష్టించబడుతోందని, కులతత్వ ఆధిపత్య శక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తీవ్రంగా ఆరోపించింది.

మైనర్ బాలురపై ఇంతటి అమానుష దాడికి తెగబడిన నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తుండగా, ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేగింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *