“ఏంటీ! జీన్స్ కేవలం ₹50.. షర్టులు కేవలం ₹25 మాత్రమేనా..?” బ్రాండెడ్ దుస్తులను అతి”ఏంటి! జీన్స్ కేవలం ₹50.. షర్టులు కేవలం ₹25 మాత్రమేనా..?” బ్రాండెడ్ దుస్తులను అతి తక్కువ ధరకు విక్రయించే భారతదేశంలోని 5 ఫేమస్ మార్కెట్లు.. ఎక్కడున్నాయో తెలుసా..???

కొత్త బట్టలు, ఫ్యాషన్ వస్తువులు కొనడం అందరికీ ఇష్టమే అయినప్పటికీ, పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

కానీ, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ సాంప్రదాయ మార్కెట్లలో ₹50 నుంచే జీన్స్, ₹100 నుంచే మంచి నాణ్యమైన దుస్తులు అత్యంత తక్కువ ధరకే లభిస్తాయి.

  • సరోజినీ మార్కెట్ & గాంధీ నగర్ (ఢిల్లీ): తక్కువ ధరలో స్టైలిష్ దుస్తులు కొనడానికి ఢిల్లీలోని సరోజినీ మార్కెట్ పెట్టింది పేరు. ఇక్కడ ₹50 కే జీన్స్, ₹100 కు 3 నుంచి 4 టీ-షర్టులు దొరుకుతాయి. దుస్తులే కాకుండా చెప్పులు, కూలింగ్ గ్లాసెస్, చేతి గడియారాలు కూడా ఇక్కడ చాలా చవకగా లభిస్తాయి. అలాగే ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్ రెడీమేడ్ దుస్తులకు ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరుగాంచింది.
  • మంగళ్‌దాస్ మార్కెట్ (ముంబై): 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్ వస్త్ర వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. పట్టు, కాటన్, షిఫాన్, నెట్ క్లాత్స్ ఇక్కడ విరివిగా లభిస్తాయి. ఇక్కడ బట్టల ధర కేవలం ₹100 నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ముంబై వాసులు షాపింగ్ చేయడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
  • బడా బజార్ (కోల్‌కతా): 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ కాలంలో ప్రారంభమైన పురాతన మార్కెట్ ఇది. మాల్స్‌తో పోలిస్తే 40% నుంచి 70% తక్కువ ధరకే బట్టలు, ఆభరణాలు, కాస్మెటిక్స్ ఇక్కడ లభిస్తాయి. కొత్త మోడల్ కుర్తీలు ₹55 నుంచే, నాణ్యమైన చీరలు ₹200 నుంచే దొరుకుతాయి.
  • రింగ్ రోడ్ మార్కెట్ (సూరత్, గుజరాత్): చీరలు, వెడ్డింగ్ లెహంగాలకు ఈ మార్కెట్ ప్రధాన కేంద్రం. మంచి డిజైనర్ చీరలు కేవలం ₹100 నుంచే, గ్రాండ్ వెడ్డింగ్ లెహంగాలు ₹1,000 నుంచే లభిస్తాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీగా షాపింగ్ చేయాలనుకునే వారికి ఈ మార్కెట్లు అద్భుతమైన ఎంపిక.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *