రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా, ఒక యువతి వరుసకు సోదరుడైన వ్యక్తికి రాఖీ కట్టేందుకు ఎంతో ఉత్సాహంతో నడుచుకుంటూ వెళ్తోంది.
దారిలో రోడ్డు పక్కన కూర్చుని సాయం కోసం ఎదురుచూస్తున్న ఒక యాచకుడిని చూసి, ఆమె అనుకోకుండా తన నడకను ఆపి నిశితంగా గమనించింది.
ఆమె తీక్షణంగా చూసినప్పుడు, ఆ దయనీయ స్థితిలో ఉన్న యాచకుడు మరెవరో కాదు.. 16 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన తన సొంత అన్నయ్యేనని గుర్తించింది. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న కన్న అన్న తన కళ్ల ముందే అలా కనిపించడంతో ఒక్క క్షణం నమ్మలేక నిశ్చేష్టురాలైంది.
వెంటనే ఆమె పరుగున వెళ్లి తన సోదరుడి చేతిని పట్టుకుని, హృదయానికి హత్తుకుని కన్నీరుమున్నీరైంది. “దేవుడా, నీకు కోటానుకోట్ల కృతజ్ఞతలు.. 16 ఏళ్ల తర్వాత నా అన్న మళ్లీ నాకు దక్కాడు” అంటూ ఆనందభాష్పాలతో వెక్కివెక్కి ఏడ్చింది. ఆపై ఎంతో ప్రేమతో తన అన్నయ్యను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది.

Leave a Reply