పొగరుకు దక్కిన తగిన శాస్తి.! “రాంగ్ రూట్‌లో వచ్చి నడిరోడ్డుపై అటూఇటూ కదల్లేక ఇరుక్కుపోయిన డ్రైవర్”. బుల్లెట్ బైక్‌పై వచ్చి బుద్ధి చెప్పిన యువకుడు. ఆ ఎంట్రీ మామూలుగా లేదుగా.. వైరల్ వీడియో.!!!

రోడ్లపై కొందరు డ్రైవర్లు తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడం పరిపాటిగా మారింది.

లేన్ క్రమశిక్షణ పాటించకుండా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టానుసారం నడిపే ఇలాంటి వ్యక్తుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా, వన్-వే లేదా సింగిల్ లేన్ రోడ్లపై ఎదురు దిశలో వాహనాలు నడిపేవారు పెద్ద తలనొప్పిగా మారుతుంటారు.

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అయితే ఈసారి రాంగ్ రూట్‌లో వచ్చిన కారు డ్రైవర్ అహంకారానికి తగిన గుణపాఠం లభించింది. దీనికోసం ఎలాంటి గొడవలు పడలేదు, నడిరోడ్డుపై అరుపులు కేకలు వేయలేదు; ఒక తెలివైన బైకర్ తన దారి వదలకుండా నిలబడటం, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించడంతో ఆ కారు డ్రైవర్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక కారు రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో, సరైన మార్గంలో తన బుల్లెట్ బైక్‌పై ఒక యువకుడు వస్తున్నాడు. తన కారును చూసి బైకర్ పక్కకు తప్పుకుని దారిస్తాడని ఆ డ్రైవర్ భావించి ఉండవచ్చు. కానీ, ఆ బైకర్ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. తన బుల్లెట్‌ను రోడ్డు మధ్యలోనే నిలిపి, స్టాండ్ వేసి మరీ తన లేన్‌లోనే స్థిరంగా నిలబడిపోయాడు.

కారు, బైక్ ఎదురెదురుగా నిలబడిపోవడంతో, రాంగ్ రూట్ కారు వల్ల అక్కడ కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి కారు డ్రైవర్ తన తప్పును సమర్థించుకోలేకపోయాడు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ అధికారి వెంటనే కారు ఫొటో తీసి చలాన్ విధించారు. ఈ చిన్న ఘటన ఆ కారు డ్రైవర్‌కు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠంగా మారింది.

ఈ ఆసక్తికరమైన వీడియోను బుల్లెట్ రైడర్ వరుణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. కారు డ్రైవర్‌ను ఎద్దేవా చేస్తూ.. “ఈరోజు ఆ బ్రదర్ అదృష్టం సెలవులో ఉంది” అని సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పోస్ట్ చేసిన 22 గంటల్లోనే 11 లక్షలకు పైగా వ్యూస్, 32 వేలకు పైగా లైకులు సాధించింది. బైకర్ చూపిన ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *