2 ఏళ్ల పసికందు.! వదినపై మోజు. మరిదితో కలిసి భర్తను మట్టుబెట్టి నాటకమాడిన భార్య. సినిమాను తలపించే భయంకర ఘటన.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బులంద్‌షహర్ జిల్లా, కేతల్‌పూర్ బన్‌సౌలీ గ్రామానికి చెందిన సుమిత్ (35) అనే వ్యక్తి ఆగస్టు 31న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సుమిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోస్టుమార్టం నివేదికలో సుమిత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతడిని గొంతునులిమి దారుణంగా హత్య చేశారని తేలింది. దీంతో పోలీసులు చేపట్టిన ముమ్మర దర్యాప్తులో సుమిత్ భార్య కాజల్ (30), ఆమె మరిది (భర్త తమ్ముడు) ఉమేష్ (30) మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది.

తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడంతో పాటు సుమిత్ ఆస్తిని దక్కించుకోవడానికి పథకం వేసిన ఈ జంట, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సుమిత్ గొంతు నులిమి చంపేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని తాడుకు వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ నాటకమాడారు. మొబైల్ కాల్ డేటా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కాజల్, ఉమేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *