ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పరిధిలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుడ్డు పండిట్ తన భార్యపై నడిరోడ్డుపై దారుణంగా దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి తీవ్ర కలకలం రేపింది.
బులంద్‌షహర్‌లోని శికార్‌పూర్ పరిధిలో గల ఆర్టీవో (RTO) కార్యాలయం సమీపంలో ఉన్న ఆయన మూడో భార్య అర్చన పండిట్ నివాసంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 2న రికార్డైనట్లు భావిస్తున్న ఈ వీడియోలో, మాజీ ఎమ్మెల్యే గుడ్డు పండిట్ తన భార్య జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకెళ్తున్న గుండెల్ని పిండేసే దృశ్యాలు రికార్డయ్యాయి. భర్త చేస్తున్న ఈ దాష్టీకాన్ని ప్రతిఘటిస్తూ అర్చన గట్టిగా కేకలు వేస్తూ చీపురుకట్టతో ఎదురుదాడికి దిగిన దృశ్యం కూడా ఆ వీడియోలో కనిపించింది.
ఈ దారుణంపై బాధితురాలు అర్చన పండిట్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్ల తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తన రక్షణ నిమిత్తం ఇంటి వద్ద షిఫ్టుల వారీగా మహిళా పోలీసులను బందోబస్తుగా నియమించాలని డిమాండ్ చేశారు.
తాను తన కుమారుడు సమర్ పండిట్‌తో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చిన గుడ్డు పండిట్.. తలుపులు బాదుతూ బయటకు రావాలని బెదిరించాడని, తీరా తలుపు తీయగానే తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుపులు విని పరుగున వచ్చిన ఇంటి పనిమనిషి తన మొబైల్‌లో ఈ దాడిని వీడియో తీయడంతోనే గుడ్డు పండిట్ వెనక్కి తగ్గినట్లు అర్చన ఆరోపించారు.
తమకు, గుడ్డు పండిట్‌కు మధ్య కోర్టులో విడాకుల పిటిషన్ విచారణలో ఉందని, ఆ కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుడ్డు పండిట్, ఆయన కుటుంబసభ్యులు తమను నిరంతరం చంపేస్తామని బెదిరిస్తున్నారని అర్చన వెల్లడించారు.
వీడియో వాస్తవికత, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, విచారణ ఆధారంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, గుడ్డు పండిట్‌కు ఇప్పటికే కాజల్ శర్మ, శీతల్ అనే మరో ఇద్దరు భార్యలు ఉన్నారని, గత కొన్నేళ్లుగా వీరి మధ్య ఈ కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని సమాచారం.

Leave a Reply