పాఠశాల, కళాశాల, కార్యాలయాలకు ప్రతిరోజూ ఆహారం తీసుకెళ్లేందుకు చాలామంది లంచ్ బ్యాగ్‌లను ఉపయోగిస్తుంటారు.
అయితే కొన్నిసార్లు పప్పు, కూరలు, పాలు వంటి ఆహార పదార్థాలు బ్యాగ్లోపల చిందిపోతుంటాయి. ముఖ్యంగా ఇన్సులేటెడ్ లేదా వేడిని నిలుపుకునే లంచ్ బ్యాగ్‌ల మూలలు, కుట్టు భాగాలు, జిప్ దగ్గర ఆహార పదార్థాల అవశేషాలు ఇరుక్కుపోతే మరకలతో పాటు దుర్వాసన కూడా ఏర్పడుతుంది.
మొదటి చిట్కా: బ్యాగ్‌లో ఆహారం చిందిన వెంటనే మెత్తని పొడి వస్త్రం లేదా పేపర్ టవల్‌తో దాన్ని తుడిచేయాలి. మరక ఎండిపోయి గట్టిపడితే, నెమ్మదిగా తుడిచి మిగిలిన మురికిని తొలగించాలి. ముఖ్యంగా జిప్, మూలల ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి.
రెండో చిట్కా: దుర్వాసనను తగ్గించేందుకు శుభ్రం చేసిన వెంటనే లంచ్ బ్యాగ్‌ను మూసివేయకుండా, బాగా గాలి ప్రసరించే ప్రదేశంలో తెరిచి ఉంచాలి. బ్యాగ్‌లో తేమ ఎక్కువసేపు ఉంటే దుర్వాసన మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.
మూడో చిట్కా: ప్రతిరోజూ భోజనం తీసుకెళ్లిన తర్వాత బ్యాగ్‌లో ఆహారపు చిన్న చిన్న అవశేషాలు ఏమైనా మిగిలాయా అని పరిశీలించి, వాటిని వెంటనే తొలగించాలి. అలాగే శుభ్రం చేసే ముందు బ్యాగ్‌పై ఉన్న తయారీదారు సూచనలను తప్పనిసరిగా పరిశీలించాలి. కొన్ని లంచ్ బ్యాగ్‌లను పూర్తిగా నీటిలో నానబెట్టడం లేదా వాషింగ్ మెషీన్లో వేయడం సరికాదు.
అందువల్ల బ్యాగ్‌ను ఎక్కువగా రుద్దకుండా, సున్నితమైన పద్ధతిలో మురికిని తొలగించి, పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ ఉపయోగించాలి. చిన్నపాటి మరకలు ఏర్పడిన వెంటనే శుభ్రం చేయడం వల్ల తరువాత ఏర్పడే మొండి మరకలు, దుర్వాసనను నివారించవచ్చు.

Leave a Reply