పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా.? డబ్బులు పోయాయని కంగారు పడకండి.! తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి.!

హడావుడిగా మొబైల్ రీఛార్జ్ చేసే క్రమంలో పొరపాటున తప్పుడు నంబర్‌ నమోదు కావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్యే. రీఛార్జ్ పూర్తయ్యాక, కట్ అయిన డబ్బులు మళ్లీ వెనక్కి వస్తాయా లేదా అన్న ఆందోళన మొదలవుతుంది.

అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పొరపాటున చేసిన రీఛార్జ్‌ను రద్దు చేసుకుని (Cancel), డబ్బులను రీఫండ్ పొందే అవకాశం ఉంది. కాకపోతే ఇది మీరు రీఛార్జ్ కోసం ఉపయోగించిన యాప్ మరియు సంబంధిత టెలికాం ఆపరేటర్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

తప్పుడు నంబర్‌కు రీఛార్జ్ అయిందని తెలిసిన వెంటనే.. మొదట మీరు ఏ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేశారో పరిశీలించండి. ముఖ్యంగా ఆయా టెలికాం కంపెనీల అధికారిక యాప్‌లలోని ‘రీఛార్జ్ హిస్టరీ’ (Recharge History) విభాగంలోకి వెళ్లి, రద్దు చేసుకునే (Cancel option) సదుపాయం ఉందో లేదో వెంటనే తనిఖీ చేయండి.

ఉదాహరణకు, జియోలో MyJio యాప్ లేదా Jio.com ద్వారా నేరుగా చేసిన కొన్ని అర్హతగల రీఛార్జ్‌లను రద్దు చేసుకునే అవకాశం ఉంది. సాధారణ రీఛార్జ్ ప్లాన్‌లకు రీఛార్జ్ చేసిన 3 గంటల్లోపు, అంతర్జాతీయ రోమింగ్ లేదా ISD ప్లాన్‌లకు అయితే 2 గంటల్లోపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పుడు జియో నంబర్‌కు రీఛార్జ్ చేసి ఉంటే, ఆ నంబర్ ఖాతాలోకి లాగిన్ అయ్యి రద్దు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇక థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌లు (PhonePe, Google Pay, Paytm వంటివి) ద్వారా చేసే రీఛార్జ్‌లకు నిబంధనలు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి లావాదేవీ వివరాలు (Transaction details), రసీదు మరియు ట్రాన్సాక్షన్ ఐడీని సురక్షితంగా ఉంచుకోవడం ఉత్తమం. రీఛార్జ్ తప్పుగా జరిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత యాప్ లేదా టెలికాం కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే మీ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *