ఛీ.. నువ్వసలు మనిషివేనా..? డబ్బు ఆశతో సొంత మేనమామే దారుణానికి పాల్పడ్డాడు.. 9 ఏళ్ల బాలిక కిడ్నాప్.. తెల్లవారుజాము వరకు సాగిన పోలీసుల ఆపరేషన్..!!

అసోం రాష్ట్రం జోర్హాట్‌ జిల్లా మారియాని ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలికను ఆమె మేనమామ సాగర్ ఘోష్, అతని భార్య మనీషా ఘోష్ కలిసి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల సమయంలో కిడ్నాపర్లు బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రాత్రి 8 గంటల్లోపు రూ.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇస్తే బాలికను చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం.

అయితే కిడ్నాపర్ల బెదిరింపులకు భయపడని బాలిక తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలింపు చేపట్టారు. చివరకు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తేర్గావ్ ప్రాంతంలోని ఇస్లాంగర్‌ వద్ద బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు.

ఈ ఘటనకు సంబంధించి బాలిక మేనమామ సాగర్ ఘోష్‌ను కొయ్లాగఢాలో, అతని సహచరుడు వసీం రహ్మాన్‌ను ఇస్లాంగర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

డబ్బు కోసం సొంత కుటుంబానికి చెందిన చిన్నారినే కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది


Posted

in

by

Tags: