అయ్యో.. పెట్రోల్ బంక్‌లోకి ఒక్కసారిగా మలుపు తిప్పిన కారు.. వెనుక నుంచి దూసుకొచ్చిన వాహనం.. కళ్లముందే ఘోర ప్రమాదం.. మహిళ మృతి.. విషాదం..!!

కర్ణాటకలోని మండ్య జిల్లా బెళ్లూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్లు సమాచారం.

శ్రవణబెళగొళ నుంచి బెంగళూరుకు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును డ్రైవర్ పెట్రోల్ బంక్‌లోకి మళ్లించేందుకు ఒక్కసారిగా ఎడమవైపు తిప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టయోటా హైలక్స్ వాహనం స్విఫ్ట్ కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుధా జైన్, ఆమె భర్త, కుమారుడు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుధా జైన్ ప్రాణాలు కోల్పోయారు.

కారులో ఉన్న మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని సమాచారం. మరోవైపు హైలక్స్ వాహనాన్ని నడుపుతున్న వికాస్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

మండ్య ఎస్పీ డాక్టర్ శోభారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సుధా జైన్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్ బంక్‌లోకి కారును మలుపు తిప్పే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.


Posted

in

by

Tags: