గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో మరో యువకుడిని ప్రేమిస్తున్న సోఫియా అనే యువతిని ఆమె సొంత అన్న, తండ్రి కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రేమ వ్యవహారంపై ఆగ్రహానికి గురైన సోఫియా అన్న.. ఆమె తలపై సుత్తితో బలంగా కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఈ హత్య ఘటనను కప్పిపుచ్చేందుకు సోఫియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని అన్న, తండ్రి కలిసి నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
అయితే పోలీసులకు అనుమానం రావడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో సోఫియా ప్రమాదంలో చనిపోలేదని, సుత్తితో కొట్టి హత్య చేసినట్లు బయటపడింది.
దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడిన అన్నతో పాటు, హత్యను కప్పిపుచ్చేందుకు సహకరించిన తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
