ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ BRICS శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో భారీ భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11వ తేదీ (శుక్రవారం) సుప్రీంకోర్టుకు అధికారిక సెలవు ప్రకటించినట్లు సమాచారం.
ఈ సెలవు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనాలతో పాటు రిజిస్ట్రార్ కార్యాలయం సహా అన్ని విభాగాలకు వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఈ సెలవుకు బదులుగా నవంబర్ 28వ తేదీ శనివారాన్ని సుప్రీంకోర్టు సాధారణ పని దినంగా నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది.
BRICS శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 11న సెలవు తర్వాత శని, ఆదివారాలతో పాటు వరుసగా సెలవులు రావడంతో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సెప్టెంబర్ 15 వరకు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం.
