“టీచర్ ఇంట్లో 36 తులాల బంగారం మాయం”.. గుట్టుచప్పుడు కాకుండా తిరిగిన ప్రేమజంట.. చివరకు ఊహించని ట్విస్ట్!

తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిస్టియన్‌పేటకు చెందిన మారియా (63) రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

  • ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీ: గత ఆగస్టు 27న మారియా తన భర్త రాజ్‌కుమార్‌తో కలిసి ఆర్కాట్‌లోని ఒక ఫాదర్‌ను కలిసేందుకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ప్రధాన ఇనుప గేటు తాళాలు పగులగొట్టి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో దాచిన హారాలు, నెక్లెస్‌లు, గాజులు సహా మొత్తం 36 తులాల (సవర్ల) బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
  • రంగంలోకి 4 ప్రత్యేక బృందాలు: బాధితురాలి ఫిర్యాదు మేరకు కాట్పాడి పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ విజికుమార్ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెన్నై, బెంగళూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఓ యువకుడు, మహిళ మెయిన్ రోడ్డుకు చేరుకుని, బస్టాండ్ నుంచి చిత్తూరు వెళ్లే బస్సు ఎక్కినట్లు స్పష్టమైంది.
  • చిత్తూరులో దొరికిపోయిన ప్రేమజంట: వెంటనే ప్రత్యేక బృందం చిత్తూరు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో సీసీటీవీలను పరిశీలించింది. అక్కడ ఓ ఇంట్లో తలదాచుకున్న ఆ జంటను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు విరుదునగర్‌కు చెందిన ముత్తువేల్ కార్తీక్ (32), అతని భార్య ప్రభావతి (30) అని, వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారని తేలింది. వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇళ్లలో ఉంటూ ఇలాంటి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు.
  • రికవరీ & రిమాండ్: చోరీ చేసిన బంగారాన్ని వెంటనే విక్రయించి, వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడం వీరికి అలవాటు. నిందితుల నుంచి 26 తులాల బంగారు ఆభరణాలతో పాటు, దొంగిలించిన సొమ్ముతో కొనుగోలు చేసిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన దంపతులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Posted

in

by

Tags: