అయ్యో దేవుడా.. ఆరేసిన బట్టలన్నీ ఏమయ్యాయి?. అర్ధరాత్రి ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు.. విద్యార్థినుల బట్టలు దొంగిలించి అరెస్టయిన విచిత్ర వ్యక్తి.. ఎలా దొరికాడంటే?.

సుళ్ల్య సమీపంలోని బెల్లారే ప్రభుత్వ బాలికల వసతి గృహంలోకి అక్రమంగా చొరబడి, విద్యార్థినుల బట్టలను దొంగిలించిన కొల్తిగే గ్రామానికి చెందిన కె. రామచంద్ర (35) అనే వ్యక్తిని బెల్లారే పోలీసులు సెప్టెంబర్ 7న అరెస్ట్ చేశారు. అదే రోజు అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం సెప్టెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

సెప్టెంబర్ 2న హాస్టల్ ఆవరణలో ఆరబెట్టిన విద్యార్థినుల దుస్తులు కనిపించకుండా పోవడాన్ని వార్డెన్ గమనించారు. ఈ విషయమై విద్యార్థినులను విచారించగా చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అనంతరం హాస్టల్‌లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా, తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఆవరణలోకి చొరబడి బట్టలను ఎత్తుకెళ్లినట్లు తేలింది.

వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లారే పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 లోని సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడైన రామచంద్రను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags: