బీహార్కు చెందిన దంపతులు ఉపాధి కోసం గుజరాత్లోని ముంద్రా ప్రాంతానికి వచ్చి, తమ 14 మరియు 11 ఏళ్ల ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నారు.
గత జనవరి 15న ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఇద్దరు బాలురూ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మూడు నెలలు గడిచినా నమ్మకం కోల్పోని ఆ తల్లిదండ్రులు, తమ పిల్లలు యాచక మాఫియా చేతిలో చిక్కుకుని ఉండవచ్చని అనుమానించారు.
పిల్లలను కనిపెట్టేందుకు తమ పనిని, జీవనోపాధిని వదులుకున్న ఆ తల్లిదండ్రులు యాచకుల వేషం వేశారు. వీధివీధినా తిరుగుతూ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. ఎన్నో నెలల పోరాటం తర్వాత, పెద్ద కుమారుడు ఓ యాచక ముఠా వద్ద ఉన్నాడన్న సమాచారంతో రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో అతడిని గుర్తించి రక్షించారు.
అయినప్పటికీ చిన్న కుమారుడి కోసం అన్వేషణ ఆగలేదు. మరో 15 రోజుల్లో పశ్చిమ బెంగాల్లోని హౌరా ప్రాంతంలో చిన్న కుమారుడిని కూడా సురక్షితంగా రక్షించారు. తమ పిల్లల కోసం తమ గుర్తింపు, సౌకర్యం, జీవితం అన్నింటినీ పణంగా పెట్టిన ఆ తల్లిదండ్రుల కన్నీటి పోరాటం.. తల్లిదండ్రులకు తమ పిల్లలే సర్వస్వం అని మరోసారి నిరూపించింది.
