హైదరాబాద్ పాతబస్తీ సంతోష్నగర్ పరిధిలోని నారాయణ జూనియర్ కళాశాల బ్రాంచ్లో, పరీక్ష పేపర్ విషయంలో ఇద్దరు బాలుర మధ్య మొదలైన చిన్న వివాదం చివరకు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ వివాదం మరింత ముదిరి, ఇండో-ఇంగ్లీష్ 7B గ్రౌండ్ వద్ద సయ్యద్ నోమన్ అనే విద్యార్థిపై ఓ గుంపు విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
