ఢిల్లీలోని కిలోక్రి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున, తన ఇంటి బయట పెద్దగా అరుస్తూ మద్యం సేవిస్తున్న డెలివరీ బాయ్స్, దాబా సిబ్బందిని నిలదీసినందుకు మణిపూర్కు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు సి. విక్రమ్ సింగ్ (54) వారి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి ఘటన అనంతరం, మరణించిన కళాకారుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వస్థలమైన మణిపూర్ రాజధాని ఇంఫాల్కు తరలించారు. ఆయన అంత్యక్రియల్లో బంధుమిత్రులు, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర ఆవేదనతో పాల్గొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సంగీత కళాకారుడిపై దాడి చేసి ఆయన మృతికి కారణమైన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
