“స్నేహితులతో ఆడుకున్న ఆ చివరి క్షణం..” అకస్మాత్తుగా కుప్పకూలిన 14 ఏళ్ల బాలుడు.. గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు.. తీవ్ర విషాదం.!!

తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే విషాద ఘటన చోటుచేసుకుంది.

తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీశ్ – ప్రియాంక దంపతుల 14 ఏళ్ల కుమారుడు సాత్విక్, సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా, సాత్విక్ ఒక్కసారిగా స్పృహతప్పి కింద కుప్పకూలిపోయాడు.

వెంటనే పాఠశాల యాజమాన్యం బాలుడిని కాపాడేందుకు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతనికి గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చిన్న వయసులోనే ఆడుకుంటూ కుప్పకూలి విద్యార్థి మృతి చెందడం తల్లిదండ్రులను, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.


Posted

in

by

Tags: