“ఫోటో సరిగ్గా తీయలేదని ఇక తిట్లు తినక్కర్లేదు!” ఐఫోన్ డ్యుయో సరికొత్త కెమెరా ఫీచర్.. అరెరే, ఇది భలే ఉందే.!!

యాపిల్ సంస్థ కొత్తగా పరిచయం చేసిన ఫోల్డబుల్ ‘ఐఫోన్ డ్యుయో’ (iPhone Duo) మోడల్‌లోని ‘డ్యుయో ప్రివ్యూ’ కెమెరా ఫీచర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రేయసి లేదా భార్యకు ఫోటోలు తీసేటప్పుడు యాంగిల్ బాలేదనో, లైటింగ్ సరిగ్గా లేదనో మగవారు చీవాట్లు తినడం సహజం. అయితే, ఈ కొత్త ఐఫోన్ డ్యుయో మొబైల్‌లోని మెయిన్ కెమెరాతో ఫోటో తీస్తున్నప్పుడే, అవతలి వ్యక్తి 5.4 అంగుళాల బయటి స్క్రీన్‌పై ఫోటో ఎలా వస్తుందో లైవ్‌గా చూసుకుంటూ తమ పోజులను సరిచేసుకోవచ్చు.

ఈ సరికొత్త ఫీచర్‌పై నెటిజన్లు, ప్రేమికులు స్పందిస్తూ.. “ఇది మాకు దక్కిన అతిపెద్ద విజయం, ఇకపై ఎన్నో బంధాలు నిలబడతాయి” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు లాంచ్ అయిన ఈ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ప్రారంభ ధర భారతదేశంలో ₹2,99,900గా ఉంది.


Posted

in

by

Tags: