“చిక్కుల్లో భారతీయ టెక్కీలు!”.. అమెరికాలో కొనసాగుతున్న వీసా వేట.. వరుస చిక్కుల్లో ప్రముఖ కంపెనీలు..!!

అమెరికాలో వీసా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు, అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ‘కాగ్నిజెంట్’ (Cognizant)పై అమెరికా కార్మిక శాఖ (US Department of Labor) కఠిన చర్యలు చేపట్టింది.

వీసా మోసాలపై లోతైన విచారణ జరుగుతున్న క్రమంలో, కాగ్నిజెంట్ సంస్థ తన ఉద్యోగులకు కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ కోసం ‘PERM’ (లేబర్ సర్టిఫికేషన్) దరఖాస్తులను దాఖలు చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించారు.

గ్రీన్ కార్డ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన మొదటి దశ అయిన లేబర్ సర్టిఫికేట్ / PERM ఫైలింగ్‌పైనే ఆంక్షలు పడటంతో, కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు, వారి అమెరికా కలలు ప్రశ్నార్థకంగా మారాయి.

అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో (Anthony D’Esposito) స్పష్టం చేశారు. ఇప్పటికే వీసా నిబంధనలపై నిఘా పెంచిన అధికారులు తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


Posted

in

by

Tags: