“భర్తను వదిలేసి 4వ ప్రియుడికి ఓకే చెప్పిన భార్య!” పోలీస్ స్టేషన్‌లో సాగిన సినిమా తరహా డ్రామా.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ..!!!

ప్రేమ, కుటుంబం, పెళ్లి వంటి పవిత్ర బంధాలను అపహాస్యం చేసేలా.. వివాహిత అయిన ఓ మహిళ తన భర్తను కాదనుకుని, తన నాలుగో ప్రియుడితోనే కలిసి జీవిస్తానంటూ పోలీస్ స్టేషన్‌లోనే భీష్మించుకుని నానా హంగామా చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

పోలీసు అధికారులు, కట్టుకున్న భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా ఆ మహిళ చేసిన హైడ్రామా అక్కడున్న వారందరినీ నివ్వెరపరిచింది. ఇప్పటికే భర్తను కాదని వరుసగా ముగ్గురితో వివాహేతర సంబంధాలు నడిపినట్లు చెబుతున్న ఆ మహిళ.. తాజాగా నాలుగో వ్యక్తితో ప్రేమలో పడి, అతనితోనే కాపురం పెట్టేందుకు సిద్ధమైంది.

ఈ విషయం బయటపడటంతో, న్యాయం చేయాలని కోరుతూ భర్త తన భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తీరా అక్కడికి వచ్చాక ఆ మహిళ ఏమాత్రం బెరుకు లేకుండా భర్తను తిరస్కరిస్తూ.. “నేను నా నాలుగో ప్రియుడితోనే ఉంటాను, అతనితోనే వెళ్తాను” అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే గట్టిగా అరుస్తూ మొండికేసింది.

భార్య తీసుకున్న ఈ వింత నిర్ణయం చూసి షాకైన భర్త.. పోలీసుల ఎదుటే “నన్ను వదిలేసి వెళ్లకు, మన సంసారాన్ని కాపాడుకో” అంటూ కన్నీరుమున్నీరై బోరున విలపిస్తూ వేడుకున్నాడు.

అయినప్పటికీ, భర్త కన్నీటిని గానీ, పోలీసుల హితవును గానీ ఏమాత్రం పట్టించుకోని ఆ మహిళ తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. చట్టబద్ధమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించిన పోలీసులు, ఈ విచిత్ర వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: