“నాకు కారు కావాలి.. మర్యాదగా సంతకం పెట్టండి!” కన్న తండ్రిని, వదినను తుపాకీతో బెదిరించిన కూతురు.! నెట్టింట వైరలవుతున్న షాకింగ్ వీడియో.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా సాహిబాబాద్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబంలో.. కారు లోన్ కోసం పూచీకత్తు (జామీను) సంతకం పెట్టాలంటూ ఓ యువతి తన తండ్రిని, వదినను తీవ్రంగా ఒత్తిడి చేసింది.

అందుకు వారు అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి, చివరికి అది పరస్పరం కొట్టుకునే స్థాయికి చేరింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ యువతి.. దాదాపు 25 నిమిషాల తర్వాత తన మగ స్నేహితుడితో కలిసి తిరిగి వచ్చింది. ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటంతో, తలుపును బలవంతంగా బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడింది. ఆ వెంటనే తన చేతిలోని పిస్టల్ తీసి తండ్రి, వదినల తలలకు గురిపెట్టింది.

“సంతకం పెట్టకపోతే మీ ఇద్దరినీ కాల్చి చంపేస్తాను” అంటూ గట్టిగా కేకలు వేస్తూ భయానక రీతిలో బెదిరింపులకు దిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తుపాకీతో బెదిరించిన ఆ యువతితో పాటు ఆమెకు సహకరించిన స్నేహితుడిపై కేసు నమోదు చేసి ముమ్మర విచారణ చేపట్టారు.


Posted

in

by

Tags: