“క్షణాల్లో కరిగిపోయిన కూతురి పుట్టినరోజు కలలు!” కన్నవారికి తీరని గర్భశోకం.. స్థబ్ధుగా మారిన పల్లె..!!!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పరిధిలో, తన పుట్టినరోజుకు ముందురోజు సాయంత్రం.. “నాన్నా, ఈసారి నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు?” అని ఎంతో ఆశగా అడిగిన కొద్ది గంటలకే ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన ఆ ప్రాంతం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కూతురి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఆ తల్లిదండ్రులు.. ఊహించని ఈ విషాదంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం కూడా తన తండ్రితో ఎంతో సరదాగా, ఉల్లాసంగా గడిపిన ఆ బాలిక.. మరుసటి రోజు జరగాల్సిన పుట్టినరోజు వేడుకలు, తండ్రి కొనివ్వబోయే కానుకల గురించి ముచ్చటించింది.

తండ్రి కూడా కూతురి ముచ్చట తీరుస్తానని మాటిచ్చారు. అయితే రాత్రి భోజనం ముగించుకుని తన గదిలోకి వెళ్లిన ఆ బాలిక, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా కనిపించిన దృశ్యం వారిని తీవ్ర షాక్‌కు గురిచేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పుట్టినరోజుకు ముందురోజు వరకు ఎంతో సంతోషంగా కనిపించిన ఆ చిన్నారి.. ఇంతటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై ఆమె మొబైల్ ఫోన్, సూసైడ్ నోట్ లాంటి ఆధారాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కేక్ కోసి సంబరాలు చేసుకోవాల్సిన వేళ.. కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులనే కాకుండా, నెటిజన్ల హృదయాలనూ తీవ్రంగా కలచివేస్తున్నాయి.


Posted

in

by

Tags: