“అయ్యో.. గుర్రంలా పరిగెత్తాలని చూస్తే.. ఆర్మీ కలలో చోటుచేసుకున్న విపరీతం.. ఇంజెక్షన్ వేసుకుని పరిగెత్తి.. ఆసుపత్రి పాలైన యువకులు.. ఆగ్రాలో షాకింగ్ ఘటన.!”

ఆగ్రాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం సన్నద్ధమవుతున్న ఇద్దరు యువకులు, రన్నింగ్ టెస్టులో వేగంగా పరిగెత్తేందుకు గుర్రాలకు ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్‌ను తమకు తామే వేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

6 కిలోమీటర్ల పరుగు పందెం ప్రారంభానికి ముందు వారిద్దరూ చెరో 3 మిల్లీలీటర్ల చొప్పున తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్‌ను శరీరంలోకి ఎక్కించుకున్నారు.

పరుగు పూర్తయిన వెంటనే, ఆ ఔషధం చూపిన తీవ్ర దుష్ప్రభావాలతో వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఇద్దరికీ తీవ్రమైన తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం సహకరించకపోవడంతో కుప్పకూలి స్పృహతప్పి పడిపోయారు. అక్కడే ఉన్న తోటి అభ్యర్థులు, స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.

ప్రస్తుతం వారికి ఐసీయూలో ముమ్మర చికిత్స అందిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సైన్యంలో చేరాలన్న మితిమీరిన ఆశతో సరైన వైద్య సలహాలు లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన అడ్డదారులు తొక్కడం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని వైద్యులు, ఉన్నతాధికారులు హెచ్చరించారు.


Posted

in

by

Tags: