“అయ్యో.. దూకకండి వద్దు.. చేయి ఇవ్వండి!” వంతెన పైనుంచి దూకబోయిన యువకుడు.. చివరి క్షణంలో కాపాడిన పోలీసులు..

ముంబైలోని బాంద్రా – వర్లీ సీ లింక్ (సముద్ర వంతెన) పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన 28 ఏళ్ల యువకుడిని టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు.

ఈ ఉత్కంఠభరితమైన సహాయక చర్యలు అక్కడ అమర్చిన నిఘా నేత్రాల్లో (సీసీటీవీ) రికార్డయ్యాయి.

ఘన్‌సోలీకి చెందిన రోహన్ గణేష్ భోంస్లే అనే సదరు యువకుడు, రాత్రి 10:30 గంటల సమయంలో ఉబర్ క్యాబ్‌లో వచ్చి వంతెనపై దిగాడు. కారులోంచి దిగిన వెంటనే అతడు వంతెన రెయిలింగ్ పైకి ఎక్కి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించాడు.

దీనిని వెంటనే గమనించిన టోల్ ప్లాజా ఉద్యోగులు సుమేత్ సావంత్, సందీప్‌లతో పాటు సహాయ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లు కదం, పెడ్నేకర్‌లు సరైన సమయంలో పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని పట్టుకుని కింద పడిపోకుండా కాపాడారు. అనంతరం రక్షించిన భోంస్లేను సాగర తీర (మెరైన్) పోలీసులకు అప్పగించారు.


Posted

in

by

Tags: