ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ సెంట్రల్ జైలు బయట నిలబడి కొందరు యువకులు చేసిన రీల్ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మీరట్ జైలు ఎత్తైన ప్రహరీ గోడను నేపథ్యంగా (బ్యాక్‌గ్రౌండ్‌గా) పెట్టుకుని 4 నుంచి 5 మంది యువకులు రీల్ రికార్డ్ చేశారు. ఆ వీడియోలో “ఒక మంచం జైలు లోపల.. మరొకటి జైలు బయట” అనే వివాదాస్పద గ్యాంగ్‌స్టర్ తరహా పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా వ్యాపించి వైరల్‌గా మారింది.
జైలు బయట వేచి ఉన్న సందర్శకులు, జైలుకు చెందిన ఎత్తైన భద్రతా గోడలు ఆ రీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జైల్లో ఉన్న ఫిరోజ్ అలియాస్ భూరా అనే ఖైదీని కలిసేందుకు ఈ యువకులు అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో ములాఖత్ కోసం ఎదురుచూస్తూ.. ఏకంగా జైలు గోడ ముందే నిలబడి ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేసినట్లు తెలిసింది.
ఈ వీడియో కాస్తా పోలీసు అధికారుల దృష్టికి చేరింది. సెంట్రల్ జైలు వంటి అత్యంత సున్నితమైన, భద్రతతో కూడిన ప్రదేశం వద్ద నిలబడి ఇలాంటి రీల్స్ చిత్రీకరించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, వీడియోలోని యువకులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ వీడియోలో ఉన్న వారిలో షెహ్జాద్ అనే యువకుడు ఉన్నట్లు, అతడు పోలీసు రికార్డుల్లో హిస్టరీషీటర్గా ఉన్న నదీమ్ మేవాతికి స్వయానా సోదరుడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ రీల్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టడంతో మీరట్‌లో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. జైళ్లు, భద్రతా ప్రాంతాల సమీపంలో సోషల్ మీడియా క్రేజ్ కోసం రీల్స్ తీస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply