థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక ప్రైవేట్ ఇంటి చేపల తొట్టెలోకి చొరబడి, అక్కడ పెంచుకుంటున్న ఖరీదైన కోయి (Koi) చేపపై లైంగిక వికృత చేష్టలకు పాల్పడిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
గత సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో, ఆ ప్రాంతంలోని ఒక ఇంటి బయట ఈ ఘటన జరిగింది. రాత్రి 8:30 గంటలకు సైకిల్‌పై వచ్చిన సుజిత్ సాయి (51) అనే వ్యక్తి, ఇంటి చేపల తొట్టె సమీపంలో తన సైకిల్‌ను నిలిపాడు.
చుట్టూ ఎవరూ లేరని గమనించిన అతడు, అక్కడున్న ఒక కోయి చేపను పట్టుకుని తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అదే సమయంలో ఇంటి యజమాని, పనిమనిషి దీనిని గమనించి వెంటనే అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే, అప్రమత్తమైన ఆ వ్యక్తి సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సైకిల్‌పై పారిపోవడంతో నిందితుడు స్థానికుడై ఉంటాడని అనుమానించిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుజిత్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా, నేరం జరిగిన రోజున ఎలాంటి దుస్తులు ధరించాడో, అవే దుస్తులతో పట్టుబడటంతో అతడిని సులువుగా గుర్తించారు. పోలీసులు జరిపిన విచారణలో, సీసీటీవీ దృశ్యాలలో ఉన్నది తానేనని సుజిత్ సాయి అంగీకరించాడు. చేపల తొట్టె వద్ద జరిగిన ఈ వికృత చేష్ట స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
