ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపు వేగంతో అర్ధశతకం సాధించి అదరగొట్టడం ఒకవైపు హైలైట్‌గా నిలిస్తే.. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి వేగంగా చేరువవుతోంది. మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ఇషాన్ కిషన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్ ఒక్కసారిగా అద్భుతమైన వేగంతో ఎగిరి బంతిని అందుకున్నాడు.
బంతిని పట్టుకునే క్రమంలో రషీద్ బౌండరీ లైన్‌కు చాలా దగ్గరగా వెళ్లడంతో అతడి కాలు బౌండరీ లైన్‌ను తాకుతుందేమోనని అందరూ ఉత్కంఠగా చూశారు. అయితే రషీద్ ఖాన్ ఒంటి కాలిపైనే అద్భుతమైన బ్యాలెన్స్‌ను కాపాడుకుంటూ ఆ క్యాచ్‌ను విజయవంతంగా అందుకున్నాడు.
ఈ అద్భుతమైన క్యాచ్‌కు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సైతం షాక్‌కు గురయ్యాడు. తన సీట్లో నుంచి ఒక్కసారిగా లేచి, ఆశ్చర్యంతో ఆ క్యాచ్‌ను చూస్తూ ఉండిపోయిన గంభీర్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున మహ్మద్ నబీ 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ తీశారు. అయితే భారత విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మహ్మద్ నబీ 33 పరుగులు చేశాడు.
భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 32 బంతుల్లోనే 82 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 256.25గా నమోదైంది.
అతడికి జతగా ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడి 33 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివరకు భారత్ కేవలం 13.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15, మంగళవారం ఢిల్లీలోనే జరగనుంది.
