“నా పది రూపాయలకు న్యాయం కావాల్సిందే!”.. హెయిర్‌కట్ తర్వాత సెలూన్ యజమాని చేసిన పని.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్ జిల్లా పరిధిలో విచిత్రమైన, కాస్త నవ్వు తెప్పించే సంఘటన ఒకటి వెలుగుచూసింది.

స్థానికంగా ఉండే ఒక వృద్ధుడు అక్కడి సెలూన్ షాపునకు వెళ్లి జుట్టు కత్తిరించుకుని, గడ్డం గీయించుకున్నాడు. పని ప్రారంభించే ముందు యజమానితో మాట్లాడి మొత్తం ఛార్జీ రూ.40గా మాట్లాడుకున్నారు.

కానీ, పని పూర్తయ్యాక సెలూన్ యజమాని మాట్లాడిన రూ.40కి బదులుగా రూ.50 లాక్కున్నాడు. దీంతో అవాక్కయిన ఆ పెద్దాయన తనను మోసం చేయడంపై నిలదీస్తూ, అదనంగా తీసుకున్న ఆ పది రూపాయలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అయితే డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన దుకాణదారుడు, పైగా ఆ వృద్ధుడిని దూషించి అవమానకరంగా అక్కడి నుంచి పంపించేశాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పెద్దాయన, ఎలాగైనా సరే ఆ సెలూన్ యజమానికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్రమైన ఫిర్యాదు చూసి అవాక్కయిన పోలీసులు, వెంటనే సెలూన్ యజమానిని ఠాణాకు పిలిపించి విచారించారు. చివరకు ఆ దుకాణదారుడు తప్పు తెలుసుకుని వృద్ధుడికి క్షమాపణలు చెప్పి, అదనంగా తీసుకున్న పది రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. దీంతో సదరు పెద్దాయన పూర్తి సంతృప్తితో తన ఊరికి తిరుగుముఖం పట్టాడు.


Posted

in

by

Tags: