“భర్త వద్దు.. నాకు నా స్నేహితురాలే కావాలి!” – నెల రోజులుగా కనిపించకుండా పోయిన వివాహిత దొరికాక చెప్పిన షాకింగ్ మాట.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..!!!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఖోడా ప్రాంతానికి చెందిన ఒక వివాహిత నెల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

భార్య కనిపించక ఆందోళన చెందిన భర్త, అన్ని చోట్లా వెతికి చివరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, నెల రోజుల అన్వేషణ అనంతరం ఎట్టకేలకు ఆమెను గుర్తించారు. అయితే విచారణలో వెలుగుచూసిన నిజం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, ఎలాంటి ఆపదలోనూ ఆమె చిక్కుకోలేదు.

సరికదా, తన ప్రాణ స్నేహితురాలితో కలిసి జీవిస్తున్నట్లు బయటపడింది. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా, తాను భర్తతో కలిసి జీవించలేనని, తన స్నేహితురాలితోనే కలిసి ఉంటానని ఆ మహిళ తేల్చిచెప్పింది.

కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత నచ్చజెప్పినా.. ఆ ఇద్దరు యువతులు ఒకరినొకరు విడిచిపెట్టడానికి ఏమాత్రం అంగీకరించలేదు. చిన్న వయసులోనే వివాహమైన ఆ మహిళ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం భర్తను, ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురిచేసింది.

పెద్దలతో మాట్లాడించి చట్టపరంగా సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ, తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఇద్దరూ మొండికేయడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ విచిత్ర బంధం వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: