ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) తన కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “బిగ్ బిలియన్ డేస్” సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఆన్లైన్ సేల్స్లో ఒకటిగా భావిస్తున్న ఈ మెగా సేల్లో టీవీలు, ఫ్రిజ్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, సౌండ్బార్లు, ఏసీలు సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. అయితే Flipkart Plus, Flipkart Black, Flipkart క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 8 నుంచే ఈ ఆఫర్లను పొందే అవకాశం కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది.
అదనంగా, Axis Bank, ICICI Bank కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు సమాచారం.
ఇదే కాకుండా.. ‘Price Crash’, ‘Rush Hours’, ‘Double Discount’ వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా ఈ సేల్ సమయంలో అందుబాటులోకి రానున్నాయి.
Acer, Haier, JBL, Aristocrat, TCL వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై కూడా భారీ తగ్గింపులు ఉండనున్నాయి.
కొత్త స్మార్ట్ఫోన్ లేదా ఇంటి అవసరాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ Flipkart Big Billion Days సేల్ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇతర ప్లాట్ఫారమ్లలో ధరలను కూడా పోల్చి చూసి, నిజంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందో నిర్ధారించుకోవడం మంచిది.

Leave a Reply