ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ల బావకు, 30 ఏళ్ల మరదలికి (తమ్ముడి భార్య) మధ్య గడిచిన రెండేళ్లుగా సాగుతున్న అక్రమ సంబంధం.. భర్త ఫోన్లో ఉన్న ఆభాసకరమైన మెసేజ్లు, హోటల్ ఫోటోల ద్వారా భార్యకు దొరికిపోవడంతో తీవ్ర కలకలం రేపింది.
రామ్పాల్ అనే వ్యక్తి తన 20 ఏళ్ల వైవాహిక జీవిత భాగస్వామి షీలారాయ్తో కలసి ఇంటి ముందు భాగంలో, అతని తమ్ముడు శ్యామ్పాల్ తన భార్య పూజతో కలసి వెనుక భాగంలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగం రీత్యా తమ్ముడు బయటి ఊరు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకున్న రామ్పాల్.. పూజకు డబ్బులు, ఖరీదైన కానుకలు ఇస్తానని, షాపు పెట్టిస్తానని ఆశచూపి ఆమెను తన బుట్టలో వేసుకున్నాడు.
సెప్టెంబర్ 14 ఉదయం భర్త ఫోన్లో అలారం మోగడంతో, దాన్ని ఆపేందుకు వెళ్లిన షీలాకు పూజ నుంచి వచ్చిన లవ్ మెసేజ్ కనిపించింది. షాక్కు గురై వాట్సాప్ చాటింగ్ తెరిచి చూడగా.. గడిచిన రెండేళ్లుగా వారిద్దరూ మాట్లాడుకున్న అసభ్యకరమైన సంభాషణలు, హోటల్లో దిగిన ఫోటోలు బయటపడటంతో షీలా ఉలిక్కిపడింది.
దీని గురించి నిలదీయగా.. “నేను రామ్పాల్ను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు” అని పూజ నేరుగా సమాధానమిచ్చింది. దీంతో షీలా తన పిల్లలతో కలసి పుట్టింటికి వెళ్లి పంచాయితీ పెట్టింది. అనంతరం లహర్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త, తోటికోడలిపై ఫిర్యాదు చేసింది.
పోలీసులు జరిపిన విచారణలో రామ్పాల్ బ్యాంక్ ఖాతా నుండి పూజకు లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరినీ దూరం పెట్టడమే కాకుండా, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply