“సామిని దర్శించుకోవడానికి వచ్చిన చోట రక్తమోడేలా అల్లాడిపోయేలా చేశారే!” – మహిళా భక్తురాలి ముక్కు కొరికి ముక్కుపుడక లాక్కెళ్లిన బిచ్చగాడు.. షాకింగ్ ఘటన..!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఉన్న ప్రసిద్ధ గోవర్ధన గిరి ప్రదక్షిణకు వచ్చిన ఒక భక్తురాలికి ఎదురైన ఘోరమైన అనుభవం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ముంబైకి చెందిన మోనికా రైనా అనే మహిళ, గత ఆరు నెలలుగా గోవర్ధన ప్రాంతంలో నివసిస్తూ ప్రతిరోజూ గిరిప్రదక్షిణ చేస్తూ పూజలు నిర్వహిస్తోంది.

ఎప్పటిలాగే ఆమె గిరిప్రదక్షిణ మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆమెను భిక్షం అడిగాడు. దానికి ఆ మహిళ భిక్షం ఇవ్వడానికి నిరాకరించడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి ఆమెను వరుసగాెంబడిస్తూ వెళ్లి గొడవకు దిగాడు.

ఒక దశలో హద్దులు దాటిన ఆ వ్యక్తి, ఆ మహిళను బలవంతంగా కిందకు తోసేసి, ఆమె గొంతు నులిమి దారుణంగా దాడి చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా, తన సొంత పళ్లతోనే ఆ మహిళ ముక్కును కొరికి తీవ్ర గాయం చేశాడు.

ఆమె ముక్కుకు ఉన్న బంగారు ముక్కుపుడకను లాక్కొని, రక్తమడుగులో పడి ఉన్న ఆ మహిళను అక్కడే వదిలేసి ఆ వ్యక్తి సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నొప్పితో, భయంతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను చూసిన తోటి భక్తులు పరుగెత్తుకుని వచ్చి కాపాడి, వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మథుర జిల్లా పోలీసులు వెంటనే గిరిప్రదక్షిణ మార్గానికి చేరుకుని తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో దాడి చేసిన వ్యక్తి మానసిక స్వస్థత లేనివాడు అయి ఉండవచ్చనే అనుమానంతో, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీల ఆధారంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పుణ్యక్షేత్రమైన మథురలో భక్తిపరవశంతో గిరిప్రదక్షిణకు వచ్చిన మహిళకు ఎదురైన ఈ హృదయ విదారక ఘటన, స్థానిక ప్రజల్లోనూ, నెటిజన్లలోనూ తీవ్ర సంచలనాన్ని, విషాదాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *