కేరళకు చెందిన ఓ బాలికకు 16 ఏళ్ల వయసులో ఉండగా, అదే ప్రాంతానికి చెందిన విష్ణు అనే 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచినా.. విష్ణు వేధింపులు మాత్రం ఆగలేదని బాధితురాలు ఆరోపించింది.
బాధితురాలు పెరిగి 18 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా.. విష్ణు ఆమెను వెంటాడుతూ, తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు.
అంతేకాదు.. ఆమె మైనర్‌గా ఉన్న సమయంలో తీసిన పాత ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెప్పి.. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బెదిరించినట్లు సమాచారం.
విష్ణు నుంచి వరుసగా వస్తున్న బెదిరింపులతో విసిగిపోయిన బాధితురాలు చివరకు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విష్ణును అరెస్ట్ చేశారు.
అనంతరం అరెస్టైన విష్ణును పెరింతల్మన్న కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. అతడిని న్యాయస్థానం కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.
ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply