బుల్లితెర, వెండితెర ప్రముఖ నటి అంకితా లోఖండే, వినాయక చవితి పూజల సందర్భంగా జరిగిన ఒక సంఘటన వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
తన భర్త విక్కీ జైన్‌తో కలిసి సహ నటుడు అర్జున్ బిజ్లానీ ఇంట్లో జరిగిన గణపతి పూజలో అంకిత పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, దేవునికి హారతి ఇస్తూ భక్తి పారవశ్యంతో పాటలు పాడుతున్న సమయంలో, అంకిత చేసిన కొన్ని విచిత్రమైన సైగలు, వెకిలి చేష్టలే ఈ వివాదానికి, నెటిజన్ల తీవ్ర నిరసనకు ప్రధాన కారణమయ్యాయి.
వీడియోలో ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేస్తున్నప్పుడు, అంకిత చిన్న పిల్లలా చేతులు తిప్పుతూ విచిత్రంగా భావ ప్రకటనలు చేయడం, అది చూసి పక్కనే ఉన్న ఆమె భర్త, స్నేహితులు పెద్దగా నవ్వడం రికార్డయ్యాయి.
పూజా సమయంలో, అదీ దేవునికి పవిత్రంగా హారతి ఇస్తున్న వేళ భక్తితో ఉండకుండా కెమెరాను చూడగానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
“పవిత్రమైన పూజను వెకిలిచేష్టగా, సోషల్ మీడియా పబ్లిసిటీ డ్రామాగా మార్చేశారు” అని, “దేవుడి పూజను కూడా ఇంత తేలికగా తీసిపారేస్తారా?” అని కామెంట్లు చేస్తూ ఆమెను ఏకిపారేస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంలో అంకితకు మద్దతుగా కొందరు ముందుకు వచ్చారు. అంకిత మనస్పూర్తిగా బప్పా (వినాయకుడి)ని ఒక బిడ్డను ప్రసాదించమని వేడుకునే ఆరాటంలోనే ఆ భావాలను ప్రదర్శించిందని, దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మతపరమైన భావనలతో ముడిపెట్టి అనవసరంగా వివాదం చేస్తున్నారని ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.
ఏదేమైనా, భక్తి కార్యక్రమాన్ని ప్రచారం కోసం వాడుకున్నారనే విమర్శలతో మొదలైన ఈ చర్చ.. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది.

Leave a Reply