భారత ఆర్థిక రాజధాని ముంబైకి జీవనాడిగా నిలిచే లోకల్ రైళ్లు ఎప్పుడూ రద్దీ, హడావుడికి ప్రసిద్ధి చెందాయి.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణించే ఈ రైళ్లలో తొలిసారి ప్రయాణించిన ఓ విదేశీ పర్యాటకుడి అనుభవానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైలు రద్దీని చూసి భయపడకుండా.. జనాల మధ్య నుంచి రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ విదేశీ పర్యాటకుడి ఉత్సాహం, సాహసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టగానే..
“నేను తొలిసారి ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించబోతున్నాను!” అంటూ అతను ఎంతో ఉత్సాహంగా చెప్పాడు.
అయితే అతని స్నేహితుడు మాత్రం.. “టికెట్ కూడా లేకుండా ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కబోతున్నావా?” అంటూ సరదాగా ఆటపట్టించాడు.
ఎలాగోలా రద్దీని దాటుకుని రైలులోకి ఎక్కిన ఆ పర్యాటకుడు.. అక్కడి స్థానిక ప్రయాణికులతో ఎంతో స్నేహంగా మాట్లాడాడు. అంతేకాదు.. గట్టిగా “ఐ లవ్ ఇండియా!” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
అయితే.. వీడియోలో అసలు ట్విస్ట్ మాత్రం తర్వాతి స్టేషన్లో చోటుచేసుకుంది.
ముంబై లోకల్ రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణించే అనుభవజ్ఞులైన ప్రయాణికుల మాదిరిగానే.. రైలు పూర్తిగా ఆగకముందే, నెమ్మదిగా కదులుతున్న సమయంలోనే అతను రైలు నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నించాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారి లక్షలాది వ్యూస్ సాధిస్తోంది.
దీంతో నెటిజన్లు “ఒక్క రోజులోనే ముంబై లైఫ్‌స్టైల్ నేర్చుకున్నాడే!”, “ముంబై లోకల్లో తొలి ప్రయాణమే ఇలా ఉందా!” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే రైలు పూర్తిగా ఆగకముందే దిగడం ప్రమాదకరం కాబట్టి, ఇలాంటి చర్యలను అనుకరించకపోవడం మంచిది.

Leave a Reply