నోయిడా సమీపంలో నల్లరంగు టాటా కారుతో ఓ యువకుడు చేసిన ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఆ యువకుడు కారును వేగంగా నడుపుతూ, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని భయపెట్టేలా వాహనాన్ని నడిపినట్లు కనిపిస్తోంది.
ఓ వీడియోలో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి వైపు కారు అత్యంత వేగంగా దూసుకెళ్లి, ఆమెకు చాలా దగ్గరగా వచ్చి ఆగినట్లు కనిపిస్తోంది. ఆమెను కారుతో ఢీకొట్టబోతున్నట్లుగా బెదిరిస్తూ, వాహనాన్ని ఆమెపైకి ఎక్కించే ప్రయత్నం చేసినట్లుగా ఆ వీడియోలోని దృశ్యాలు ఉన్నాయి.
మరో వీడియోలో కూడా రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రజలను లక్ష్యంగా చేసుకుని అదే కారును ప్రమాదకరంగా నడుపుతూ భయపెట్టినట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో.. సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు నోయిడా పోలీసులను కోరుతున్నారు.
ఈ ఘటనను నోయిడా పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే.. ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించబడింది? కారు ఎవరి పేరుపై ఉంది? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
రోడ్డుపై ప్రయాణించే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం కారు నంబర్‌ను గుర్తించి, సంబంధిత డ్రైవర్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి వెల్లడించారు.
వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

Leave a Reply