బెంగళూరులోని సెంట్రల్ జీఎస్టీ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక అధికారి రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు.
ఈ ఘటన బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న కేంద్రీయ సదన్ భవనంలో జరిగినట్లు తెలుస్తోంది. సదరు అధికారి లంచం డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
సయ్యద్ జమీర్ అనే వ్యాపారి వద్ద బాకీ ఉన్న సెంట్రల్ జీఎస్టీ బకాయిల వ్యవహారంలో, అలాగే తనపై నమోదైనట్లు చెప్తున్న ఫిర్యాదును ముగించడానికి రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు దాడికి ప్లాన్ చేశారు.
దీంతో లోకాయుక్త అధికారులు పక్కా వ్యూహంతో చేపట్టిన తనిఖీల్లో, జీఎస్టీ సూపరింటెండెంట్ మోహిత్ ప్రతాప్ సింగ్ ఆ డబ్బును తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నగదు బదిలీలో మధ్యవర్తిగా వ్యవహరించిన సల్మాన్ షేక్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు లోకాయుక్త తెలిపింది. లంచం తీసుకున్న అధికారి, మధ్యవర్తిపై విచారణ కొనసాగుతోంది.

Leave a Reply