“కుటుంబం కోసం ఒకేసారి 6 ఐఫోన్లు!” – అసలు డబ్బు లెక్కపెట్టలేదంట! ఆ వ్యక్తి అన్న ఒక్క మాట: “లైఫ్‌స్టైల్ కోసం కొంటున్నాం!” – ఇంత ధర ఉన్నా ఈ స్థాయిలో క్రేజా?!!

ఐఫోన్ ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల విక్రయాలు ప్రారంభం కావడంతో, దేశవ్యాప్తంగా ఉన్న ఆపిల్ స్టోర్ల వద్ద జనాలు పోటెత్తారు.

చాలామంది క్రితం రోజు రాత్రి నుంచే స్టోర్ల బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఐఫోన్ కొనుగోలు చేయడానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

ముంబైలోని ఆపిల్ స్టోర్‌కు గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లు వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఐఫోన్ కొనడానికి తన కుటుంబంతో కలిసి వచ్చాడు. తన భార్యే ఆ కొత్త ఫోన్‌ను మొదట ఓపెన్ చేయాలని ఆయన పేర్కొన్నాడు.

అలాగే, మరొక వ్యక్తి తన కుటుంబ సభ్యులందరి కోసం ఒకేసారి 6 ఐఫోన్లను కొనుగోలు చేశాడు. ఆయనతో పాటు ఒక చిన్న బాబు కూడా ఉండగా… కేవలం తమ లైఫ్‌స్టైల్ (జీవనశైలి) కోసమే ఐఫోన్లు కొంటున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. డబ్బు ఎంత అని లెక్కపెట్టకుండా, మనకు నచ్చినదాన్ని కొనుక్కోవాలనే రీతిలో ఆయన మాట్లాడాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *