భార్యపై ఎంత ప్రేమో.! అడగ్గానే ఐఫోన్ కొనిచ్చిన భర్త!. భార్య కోరికను తీర్చేశాడు.. ఇలాంటి భర్త కూడా ఉంటాడా?. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెమా వైరల్.!!!

ఐఫోన్ కొనాలని భార్య అడగడంతో… ఇంట్లోని బంగారు నగలను అమ్మేసి, ఢిల్లీ నుంచి నోయిడాకు వచ్చిన ఒక వ్యక్తికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా ప్రచారమవుతోంది.

ఐఫోన్ సిరీస్ విక్రయాలు ప్రారంభం కావడంతో, కొత్త ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆపిల్ స్టోర్ల వద్ద వినియోగదారులు పోటెత్తారు. ఆ గుంపులో ఉన్న ఈ వ్యక్తి కూడా తన భార్య కోసం ఫోన్ కొనడానికే వచ్చినట్లు తెలిపాడు.

తన భార్యకు ఐఫోన్ కొనివ్వాలనే కోరికతో ఇంట్లోని బంగారాన్ని విక్రయించినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నోయిడా వచ్చి ఆపిల్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ కొనుగోలు చేశాడు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, తన భార్య కోరికను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.

ఐఫోన్ సిరీస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రోజే పలు ఆపిల్ స్టోర్లలో కస్టమర్లు సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉన్నారు. కొత్త ఐఫోన్‌ను దక్కించుకోవడానికి కొందరు తెల్లవారుజాము నుంచే షాపుల ముందుకు వచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో విక్రయాలు జరిగిన ప్రాంతాల్లో భారీగా జనం చేరి రద్దీ నెలకొంది.

ఈ క్రమంలో, భార్య కోసం బంగారాన్ని అమ్మేసి ఐఫోన్ కొనడానికి వచ్చిన భర్త ఉదంతం సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షించింది. కొత్త ఐఫోన్ పట్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మారింది. భార్య ఆశను నెరవేర్చడానికి ఇంటి బంగారాన్ని అమ్మేశానని ఆ వ్యక్తి చెప్పడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *