“భిక్షాటన చేసే చేతులు.. ఈరోజు ఎన్నో ప్రాణాలను కాపాడాయి..!” అధికారులు పట్టించుకోకపోతే ఏంటి.. నా మనసు ఒప్పలేదు.. నడిరోడ్డుపైకి వచ్చి ప్రమాదకరమైన గుంతను పూడ్చిన యాచకుడు..!!

హైదరాబాద్‌లోని ప్రముఖ కేబీఆర్ పార్క్ ప్రధాన రహదారిపై ఏర్పడిన ఒక పెద్ద గుంత, చాలా రోజులుగా పూడ్చకుండా వదిలేయడంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది.

ఇంత పెద్ద రహదారిపై అంత ప్రమాదకరమైన గుంత ఉన్నప్పటికీ, అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆ గుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులు తరచూ అదుపుతప్పి కింద పడిపోవడం, ప్రమాదాల బారిన పడటం జరుగుతూ వస్తోంది. ఇది గమనించిన ఆ ప్రాంతంలోని ఒక యాచకుడు, ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.

అధికారులు చేయాల్సిన పనిని ఆ యాచకుడు తానే స్వయంగా చేయడం ప్రారంభించాడు. రోడ్డుపై ఉన్న ఆ ప్రమాదకరమైన గుంతను తన చేతులతోనే మట్టి తీసిపోసి పూడ్చి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశాడు.

వాహనదారులు కింద పడి గాయపడకూడదని, పెద్ద ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్న ఒకే ఒక మంచి ఉద్దేశ్యంతో ఆ యాచకుడు ఈ పని చేశాడు. ఇది చూసిన స్థానికులు, పలువురు వాహనదారులు ఆశ్చర్యపోయారు.

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేలా, అలాగే తోటి మనుషుల పట్ల ఆ యాచకుడు చూపిన శ్రద్ధను, మానవత్వాన్ని తెలియజేసేలా ఈ సంఘటన నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండటంతో, ఆ యాచకుడి మంచి పనికి ప్రజలందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *