కర్ణాటక రాష్ట్రంలోని ఒక బార్‌లో జరిగిన గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసు అధికారిని, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి దారుణంగా కొరికిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గురువారం మధ్యాహ్నం మోహన్ రెడ్డి, గౌతమ్ అనే ఇద్దరు వ్యక్తులు బార్ క్యాషియర్ గురుశేఖర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో క్యాషియర్ గురుశేఖర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణస్వామి అనే పోలీసు, వారిద్దరితో మాట్లాడి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఊహించని విధంగా, పీకలదాకా మద్యం మత్తులో ఉన్న మోహన్ రెడ్డి.. నారాయణస్వామి కుడి చేతిని కుక్కలా దారుణంగా కొరికాడు.
పోలీసును ఒక మందుబాబు దారుణంగా కొరుకుతున్న ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన పోలీసు నారాయణస్వామికి వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నంగాలి పోలీసులు, మత్తులో గొడవ చేసి పోలీసును కొరికిన మోహన్ రెడ్డి, గౌతమ్ ఇద్దరినీ వెంటనే అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply