అయ్యో భగవంతుడా! పిడుగుపాటుకు పేలిన సెల్‌ఫోన్. 18 ఏళ్ల విద్యార్థి దారుణ మృతి. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.!

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవి తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి చరణ్ సింగ్ (18) ప్రాణాలు కోల్పోయాడు.

చరణ్ సింగ్ పొలంలో తన తాతకు వ్యవసాయ పనుల్లో సహాయం చేసి, సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో అనూహ్యంగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై, భారీ వర్షం కురవడం ప్రారంభమైంది.

వర్షం నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటికి వెళ్తున్న క్రమంలో, అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూడిన పిడుగు పడింది. ఆ సమయంలో చరణ్ సింగ్ చొక్కా జేబులో ఉన్న సెల్‌ఫోన్ పిడుగుపాటు ప్రభావంతో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు ఆరుబయట సెల్‌ఫోన్ ఉపయోగించడం లేదా దానిని వెంట ఉంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. చేతికొచ్చిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో మరియు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *