అయ్యో.. నా కొడుక్కి ఏమైంది? ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిన ఐటీ ఉద్యోగి. కన్నీరుమున్నీరైన కుటుంబం. ఆసుపత్రిలో ఎదురైన తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన.!!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కుడిక్యాల వినయ్ (26) బ్రెయిన్ ట్యూమర్ (మెదడు కణితి) సమస్యతో ఈ నెల 16వ తేదీన కామారెడ్డి జిల్లాలోని తన ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

వెంటనే అతడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ అతడికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు, అతడు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.

వైద్యులు పరిస్థితిని వివరించడంతో, పుట్టెడు దుఃఖంలోనూ వినయ్ కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప నిర్ణయాన్ని వారు ధైర్యంగా తీసుకున్నారు.

వినయ్ గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల వంటి అవయవాలను సేకరించిన వైద్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురు రోగులకు శస్త్రచికిత్స ద్వారా వాటిని విజయవంతంగా అమర్చారు. తన మరణంతోనూ ఐదుగురికి ప్రాణదానం చేసిన వినయ్ వారి రూపంలో ఇంకా జీవించే ఉన్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *