“అరె పాపులారా..! చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టరా…?” స్మశాన వాటికలోనూ చేతివాటమా.. సమాధులపై ఉన్న రాళ్లను ఎత్తుకెళ్లి అమ్మేసిన ఘోరం.. మద్యం మత్తులో పట్టుబడిన విచిత్ర దొంగలు..!!

కేరళ రాష్ట్రంలోని చర్చి స్మశాన వాటికల నుంచి సమాధులపై ఉన్న ఖరీదైన గ్రానైట్ రాళ్లను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు నాటకీయంగా అరెస్టు చేశారు.

పట్టుబడిన నిందితులను మలయాళీ అయిన సజిత్, కన్యాకుమారికి చెందిన జలాల్ సుందర్ సింగ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుర్జిత్ బర్మన్‌గా గుర్తించారు.

మల్లపల్లిలోని రెండు చర్చిలలో గ్రానైట్ రాళ్లు అమర్చే పని చేసే కార్మికులే ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించడానికి సులభంగా ఉండేలా, వాళ్లు సమాధులపై గ్రానైట్ రాళ్లను అమర్చేటప్పుడే ఎక్కువ సిమెంట్, మోర్టార్ ఉపయోగించకుండా తాత్కాలికంగా మాత్రమే అమర్చారు.

వేరే చర్చిలలో కొత్త ఆర్డర్లు వచ్చినప్పుడు, అంతకుముందు సిమెంట్ లేకుండా సమాధులపై సులభంగా అమర్చిన ఆ రాళ్లను తొలగించి, వాటిని తీసుకెళ్లి కొత్త ప్రదేశంలో అమర్చి సొమ్ము చేసుకున్నారు. ఇందుకోసం తమ కారు వెనుక సీట్లను తొలగించి, గ్రానైట్ రాళ్లను తరలించేందుకు అనువుగా వాహనాన్ని ప్రత్యేకంగా మార్పు చేశారు. ఒక సమాధికి గ్రానైట్ రాళ్లు అమర్చేందుకు వీరు రూ.45,000 వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

స్మశాన వాటికల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో, పోలీసులకు మొదట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే, వీరిలో ఒకరు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అతడిని బెయిల్‌పై విడిపించేందుకు అతని అనుచరులు ఎవరూ రాకపోవడంతో, అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి మిగతా వారిని పట్టుకుని విచారించగా ఈ ముఠా దొంగతనాల గుట్టు రట్టయింది.

మార్కెట్‌లో గ్రానైట్ రాళ్ల ధర ఎక్కువగా ఉండటం, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అరెస్టయిన వారు అంగీకరించారు. మల్లపల్లి మార్తోమా చర్చి, మంగుళిప్పాడి చర్చి స్మశాన వాటికల్లో జరిగిన ఈ ఘటనలు ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *