“ఆకుపచ్చ చుక్క, ఎరుపు చుక్క. సబ్బులు, షాంపూలు ఇకపై శాఖాహారమా లేదా మాంసాహారమా? కేంద్ర ప్రభుత్వ సంచలన ఉత్తర్వులతో మార్కెట్‌లో కలకలం.!!”

సబ్బులు, షాంపూలతో సహా సౌందర్య సాధనాలు, మేకప్ ఉత్పత్తులలో ఉపయోగించే ముడి పదార్థాలు శాఖాహారమా లేక మాంసాహారమా అనేది వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా వాటిపై ప్రత్యేక గుర్తులను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిబంధనల ప్రకారం, సౌందర్య సాధనాల తయారీలో పూర్తిగా వృక్ష సంబంధిత (మొక్కల ఆధారిత) పదార్థాలను ఉపయోగిస్తే ‘ఆకుపచ్చ చుక్క’ (Green Dot) గుర్తును, జంతు సంబంధిత లేదా మాంసాహార పదార్థాలు వాడితే ‘ఎరుపు చుక్క’ (Red Dot) గుర్తును ప్యాకేజింగ్‌పై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించింది.

ప్రజలు తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల నాణ్యతను, వాటి స్వభావాన్ని పూర్తిగా తెలుసుకుని కొనే హక్కును కాపాడేందుకే ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చారు. దీని ద్వారా వినియోగదారులు తమకు కావలసిన ఉత్పత్తులను ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఎంచుకుని వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *