“ఒరేయ్ నరకకరా.. నువ్వు మనిషివేనా..!” కుక్కను గొడ్డలితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది.. ప్రాణభయంతో పరుగులు తీసిన మూగజీవి.. గుండెలు దడదడలాడించే సీసీటీవీ వీడియో..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి కుక్కను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తిస్తోంది.

ఆ ఉన్మాది మరొక కుక్కపై కూడా దాడికి యత్నించగా, అది అదృష్టవశాత్తు ప్రాణాలతో తప్పించుకుని పారిపోయింది.

సోమవారం సాయంత్రం 5:15 గంటల సమయంలో నరేంద్ర అహిర్వార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన హోమీ జాధవ్ అనే వ్యక్తి, చేతిలో గొడ్డలి పట్టుకుని అక్కడ తిరుగుతున్న వీధి కుక్కలను వెర్రితలలు వేస్తూ వేటాడి దాడి చేయడం ప్రారంభించాడు.

అక్కడ ఉన్న ఒక కుక్కను పట్టుకుని అతడు గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ కుక్క, తట్టుకోలేని నొప్పితో అల్లాడిపోతూ ఘటనా స్థలంలోనే దారుణంగా ప్రాణాలు విడిచింది. అనంతరం మరొక కుక్కను కూడా నరికేందుకు యత్నించగా, అది భయంతో అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుంది.

ఈ దాడి సమయంలో, నరేంద్ర తమ్ముడి భార్యపై కూడా గొడ్డలి పడబోగా, ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లి దాక్కుంది. ఈ దారుణాన్ని నిలదీసేందుకు వెళ్లిన నరేంద్రతో కూడా ఆ ఉన్మాది గొడవపడి బెదిరింపులకు దిగాడు.

ఈ దారుణ ఘటనపై నరేంద్ర అహిర్వార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హోమీ జాధవ్ తరచూ ఆయుధాలతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *