జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా బోండియాల్గామ్ క్రాసింగ్ వద్ద పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వ్యక్తులను తనిఖీ చేయగా, వారి వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా దాచి ఉంచిన 21 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఎక్సైజ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సాధారణంగా పోలీసులకు నేరస్థులు దొరికినప్పుడు వారి ముఖాల్లో భయం లేదా బాధ కనిపించడం సహజం, కానీ ఈ ఘటనలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ముఖంలో ఎటువంటి భయం లేకుండా నవ్వుతూ పోజులిచ్చిన ఫోటో అంతర్జాలంలో ప్రత్యక్షమైంది. తమ కేసుకు సంబంధించిన వివరాల పత్రాలను చేతిలో పట్టుకుని వారిద్దరూ కెమెరా వైపు చూస్తూ సంతోషంగా నవ్వుతున్న ఈ వింత దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విచిత్రమైన ఫోటోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు, హాస్యస్పద వ్యాఖ్యలను నెట్టింట పంచుకుంటున్నారు. ‘ఇదేం సరదా అరెస్టు రా బాబోయ్?’ అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటంతో ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Leave a Reply