“నా వయసు 22.. ఆవిడ వయసు 34..!” రూమ్‌కి ఒంటరిగా పిలిచి ఏం చేస్తున్నారో తెలుసా..? లేడీ టీమ్ లీడర్ ‘లీలలు’.. అరిచి గీపెట్టి పరుగెత్తిన యువకుడు.. నెట్టింట వైరలవుతున్న సీక్రెట్ పోస్ట్!

ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువకుడు, తన 34 ఏళ్ల మహిళా టీమ్ లీడర్ తనను ప్రేమ వలలో పడేయడానికి ప్రయత్నిస్తోందంటూ ‘రెడిట్’ (Reddit) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుర్‌గావ్‌లోని ఒక బహుళజాతి సంస్థలో (MNC) ఉద్యోగంలో చేరిన ఆ యువకుడు, తనకు ఎదురైన షాకింగ్ అనుభవాలను పంచుకుంటూ నెటిజన్ల నుంచి సలహాలు కోరాడు.

ముంబైలో నివాసముండే ఆ లేడీ టీమ్ లీడర్ తరచూ గుర్‌గావ్ ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తుండేదట. ఇటీవల జరిగిన ‘టీమ్ అౌటింగ్’ పార్టీలో డాన్స్ చేస్తున్న ఆ యువకుడి దగ్గరకు వచ్చి, “నువ్వు చూడటానికి చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నావు” అని చెవిలో గుసగుసలాడింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు.

ఆ తర్వాత కూడా ఆ మహిళ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒక క్లయింట్ మీటింగ్ సమయంలో హఠాత్తుగా ఆ యువకుడి షర్ట్ కాలర్ సరిచేస్తున్నట్లుగా నటిస్తూ తాకి మాట్లాడింది. అంతేకాకుండా, మిగతా ఉద్యోగులెవరినీ పిలవకుండా ఈ యువకుడిని మాత్రమే ఒంటరిగా తన ఫ్లాట్‌కి పార్టీ కోసం ఆహ్వానించింది. దీంతో తాను ఏదో ప్రమాదంలో చిక్కుకోబోతున్నానని గ్రహించిన ఆ యువకుడు ఇంటర్నెట్‌లో సహాయం కోరాడు.

ఈ వింత పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఆ యువకుడికి పలు హెచ్చరికలతో కూడిన సలహాలు ఇస్తున్నారు. “ఆమె నీకు సీనియర్, ఈ కార్పొరేట్ మాయవలంలో పడకు. నీకు ఇష్టం లేకపోతే ప్రారంభంలోనే ముఖం మీదే వద్దని చెప్పేయ్. కాదని ప్రేమలో పడితే నీ ఉద్యోగానికే ప్రమాదం దాపురిస్తుంది” అని చాలామంది హెచ్చరించారు.

మరికొందరైతే.. “ఆమెతో సంబంధం పెట్టుకుంటే నీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగ స్వేచ్ఛ రెండూ పోతాయి. ఒకవేళ భవిష్యత్తులో మనస్పర్థలు వచ్చి విడిపోతే, నీపైనే లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి జైలుకు పంపే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త తంబీ (తమ్ముడూ)!” అని హెచ్చరించారు. ఈ కార్పొరేట్ లవ్ పంచాయితీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *