గుజరాత్లోని గిర్ సోమ్నాథ్ జిల్లా, జుట్వాడ్లీ (Jutvadli) గ్రామంలో ఒక ఇంటి డాబాపై సింహాల కుటుంబం గంటల తరబడి విశ్రాంతి తీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇంటి పైకప్పుపైకి వచ్చిన సింహాలను చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఒక మగ సింహం, 3 ఆడ సింహాలు, 2 సింహం కూనలతో కలిపి మొత్తం 6 సింహాలు ఆ ఇంటి డాబాపై ఉన్నట్లు సమాచారం. ఇలా సింహాలు కుటుంబ సమేతంగా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ అరుదైన దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. సింహాలు ఇంటి డాబాపై గంటల తరబడి తిష్టవేయడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గిర్ సోమ్నాథ్ ప్రాంతంలో సింహాలు జనావాసాల్లోకి రావడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నప్పటికీ, ఒకే కుటుంబానికి చెందిన సింహాలు ఇలా ఇంటి డాబాపై ఎక్కువ సేపు సేదదీరిన ఈ దృశ్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply